మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా బొమ్మరాస్ మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మంది తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రియురాలు అక్కడికక్కడే మరణించగా అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రేమికుడిని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియుడు కూడా మరణించాడు. తమ ప్రేమను అంగీకరించకపోవడంతో వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రంగారెడ్డి జిల్లా దోమ గ్రామానికి చెందినవారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి