అనంతపురం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసుకు చెందిన రాయలసీమ శాసనసభ్యుడు టిడీ వెంకటేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలోనే అతి పెద్ద బందిపోటుగా కెసిఆర్ ను ఆయన అభివర్ణించారు. పూలన్ దేవి, వీరప్పన్ కన్నా మించిన బందిపోటు కెసిఆర్ అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ 200 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. నరహంతకుడు కెసిఆర్ ను దేశం నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఉద్యోగాల ఆశ జూపి ఉద్యమంలోకి తీసుకు వస్తున్నారని ఆయన అన్నారు. పదవి కోసం కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో ఈ నెల 28వ తేదీ తర్వాత అద్భుతాలేమీ జరగవని ఆయన అన్నారు. ఈ డెడ్ లైన్ కూడా పాత డెడ్ లైన్ లోనే కలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్ రాష్ట్రంలో 200 మంది మరణానికి కారణమయ్యాడని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి