29న తెనాలిలో సమైక్యాంధ్ర బహిరంగసభ

జై ఆంధ్ర ఉద్యమానికి ఎదురొడ్డి నిలిచిన నన్నపనేని వెంకట్రావుపై జరిగిన దాడులను సైతం ప్రతి ఘటించి ముల్కి నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి నన్నపనేని వెంకట్రావు, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భగ్నం చేసేందుకు బాంబు దాడులు చేశారు. పోలీసుల లాఠీ దెబ్బకు ఎదురు తిరిగిన ఆరుగురిపై తుపాకి గురిపెట్టి కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులో ఆరుగురు ఆశువులు బాసి అమరులయ్యారు. పోలీస్ లాఠీ చార్జిలో అనేక మంది గాయపడ్డారు. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం గల నన్నపనేని వెంకట్రావు తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా మూడు పర్యాయాలు పదవి బాధ్యతలు స్వీకరించారు.
1972లో తెనాలిలో జరిగిన సమైక్యాంధ్ర పూర్వ ఘట్టాలను ప్రజలు అవలోకనం చేసుకునే విధంగా సమైక్యవాదంను మరింతగా బలోపేతం చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో సమైక్యా వాదులను తెనాలి సమైక్య వాదులకు జరిగే సత్కార సభకు భారీ సంఖ్యలో తరలించటానికి సమాలోచనలు జరుగుతున్నాయి. ఆమరణ నిరాహార దీక్షలు చేసి సమైక్య వాదానికి ఊపిరి పోసిన సమైక్య వాదులు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిీలు వివేకా నందరెడ్డి, ఎర్రమనాయడు, అచ్చం నాయుడు, లగడపాటి రాజగోపాల్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎనుమల రామకృష్ణుడు, సోమిరెడ్డి, చంద్రమోహన్, గాలి ముద్దు కృష్ణమనాయుడు, ముమ్మనేని తదితరులను ఘనంగా సన్మానించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియ వచ్చింది.