హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు గుమ్మడి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నమే ఆయనను కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రముఖ వైద్యుడు సోమరాజు ఆధ్వర్యంలో గుమ్మడి వెంకటేశ్వరరావుకు కేర్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఆయన వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.
ఆయన వయస్సు 83 ఏళ్లు. అదృష్టదీపుడు చిత్రం ద్వారా ఆయన తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టారు. దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయనకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును ఆయన 1999లో అందుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి