చంద్రబాబు ఉండగా రాష్ట్రం విడిపోదు: ఆలపాటి

Telugudesam
గుంటూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఘనత ఎన్టీఆర్, వైఎస్ లతో పాటు చంద్రబాబుకు కూడా దక్కాలనీ పలువురు జిల్లా టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. 'దివంగత ముఖ్యమంత్రులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు ఉండి ఉంటే రాష్ట్రం విభజన యత్నాలు జరిగి ఉండేవి కావు అని అంటున్నారు. అంతేగాని చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రం విడిపోదు.. అని చెప్పరా..? పార్టీ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలి. మన నాయకుల్ని మనమే పట్టించుకోవడం లేదు.' అంటూ మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చురకలు అంటించారు.

నాయకత్వం పిలుపు మేరకు స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కోరుతూ సోమవారం పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్ర టీడీపీకే పట్టినట్లుందని, జేఏసీకమిటీ బలోపేతంగాలేదని ఆయన తెలిపారు. అధిక ధరలకు కాంగ్రెస్‌ మాఫియానే కారణమని ఆరోపించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా కన్వీనర్‌ ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లా డుతూ రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలుగువారమంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలన్నారు. ధరలు అదుపు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెప్టెంబర్‌ రెండున వైఎస్‌ అకాల మరణం, అక్టోబర్‌ రెండున వరదలు, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ప్రత్యేక ఉద్యమాలు... వెరసి రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందన్నారు. ఐదేళ్లలో నిత్యవసరాల ధరలు 200 నుంచి 400 శాతం వరకు పెరిగి ప్రజలకు భారంగా మారాయన్నారు. పెట్రోలు, డీజిల్‌, బస్సు చార్జీలు పెంచడాన్ని ఖండించారు. విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. రేషన్‌కార్డులు, ధరల నియంత్రణకు వైఎస్‌వేసిన మంత్రుల కమిటీ ఏమైందని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వరదలు వచ్చే..బురదను తెచ్చే..సామాన్యుడు సచ్చే..అని వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ నెల 29న తెనాలిలో జరిగే సమైక్యాంధ్ర భారీ బహిరంగసభకు అధికసంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+