చర్చలకు బృందాలుగా ఢిల్లీ రావద్దు: మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: తెలంగాణపై చర్చలకు బృందాలుగా ఢిల్లీకి రావద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కాంగ్రెసు రాష్ట్ర నాయకులకు సూచించారు. తెలంగాణపై త్వరలోనే ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై తమకు తెలుసునని ఆయన చెప్పారు. తనను తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు కె. కేశవరావు, వివేక్, జానారెడ్డి, దామోదర్ రెడ్డి తనను కలిసినట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. డెడ్ లైన్లను వాయిదా వేసుకోవాలని కూడా ఆయన కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సూచించారు. తెలంగాణ నాయకులు ఢిల్లీకి వస్తే సీమాంధ్ర నాయకులు వస్తారని, దీని వల్ల తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగదని ఆయన చెప్పారు. అయితే కేంద్ర ప్రకటన తెలంగాణకు అనుకూలంగా వస్తుందని ఆయన స్పష్టంగా మీడియా ప్రతినిధులతో చెప్పలేదు.

సంక్షోభం వల్ల తెలంగాణ రాదని ఆయన చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలంటే రాష్ట్రంలో శాసనసభ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ తగిన విధంగా సహకరించాలని ఆయన సూచించారు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల గురించి కూడా తమకు తెలుసునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+