మేడారం జాతరలో సిఎం రోశయ్య

అంతకు ముందు ఆయన సమ్మక్క సారలమ్మలకు ప్రభుత్వం తరఫున చీరలు అందించారు. అక్కడ స్నాన ఘట్టాలకు శంకు స్థాపన చేశారు. కన్నెపల్లి, వూరట్టం, పడిగావుల గ్రామాలకు రక్షిత నీరు అందించే పథకానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. మేడారం జాతరకు 90 లక్షల మంది వస్తారని ఒక అంచనా. తెలంగాణ ఉద్యమం ఊపుగా నడుస్తున్న నేపథ్యంలో రోశయ్య పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోశయ్య కార్యక్రమం సందర్భంగా నిరసన తెలియజేయడానికి బయలుదేరిన తెలంగాణ ఆందోళనకారులను పోలీసులు ములుగు వద్ద అరెస్టు చేశారు. మేడారం జాతరలో ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు.












Click it and Unblock the Notifications