కారకులపై క్రిమినల్ చర్యలు: కలెక్టర్

Naveen Mittal
హైదరాబాద్: నగరంలోని నారాయణగుడాలో కూలిన భవనం అక్రమ నిర్మాణానికి బాధ్యులైనవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ చెప్పారు. సంఘటనా స్థలాన్ని ఆయన శనివారం ఉదయం సందర్శించారు. సహాయక చర్యలను సమీక్షించారు. కూలిన భవనం అక్రమ నిర్మాణమేనని, అనుమతులు లేకుండా భవన నిర్మాణం సాగుతోందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రమాదంలో 13 మంది మరణించారని, వారి చిరునామాలు గుర్తించామని ఆయన చెప్పారు.

శిథిలాల కింది నుంచి ఆరుగురిని ప్రాణాలతో వెలికి తీశామని, వారికి చికిత్స జరుగుతోందని ఆయన చెప్పారు. ఇంకా కొంత మంది శిథిలాల కింద ఉండవచ్చుననే అనుమానంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగిస్తున్నామని ఆయన అన్నారు. తొలగింపులు పూర్తయిన తర్వాత భవనం కూలిన సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని ఆయన అన్నారు.

భవనం కూలిన సంఘటనపై బిజెపి స్థానిక శాసనసభ్యుడు జి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారుల నిర్లక్ష్యమే సంఘటనకు కారణమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+