ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం: బాబు

పునాది సరిగా లేకుండా నాలుగు అంతస్తులు కట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇలాంటి నిర్మాణాలు నగరంలో కోకొల్లలుగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. అసలు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఎవరనేది గుర్తించడంలో కూడా గంటల కొద్దీ ఆలస్యం జరగడం పాలనా యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. బాధితుల సమాచారం కూడా అధికారులు సేకరించలేకపోయారని ఆయన అన్నారు. సహాయక చర్యలు చేపట్టే సమర్థత కూడా అధికార యంత్రాంగానికి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications