రోశయ్య కన్నా బాబు నయం: దామోదర్

కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. పిసిసి సమన్వయ కమిటీకి చైర్మన్ గా వీరప్ప మొయిలీ ఉండడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల మొయిలీ వైఖరి సరిగా లేదని ఆయన అన్నారు. సమన్వయ కమిటీకి చైర్మన్ గా పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉండడం సంప్రదాయమని ఆయన అన్నారు. వెంటనే డిఎస్ ను సమన్వయ కమిటీ చైర్మన్ గా వేయాలని, ముఖ్యమంత్రి రోశయ్య వైస్ చైర్మన్ గా ఉండాలని ఆయన అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటైన సమన్వయ కమిటీకి అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కేశవరావు చైర్మన్ గా ఉన్నారని, వైయస్ వైస్ చైర్మన్ గా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications