ముంబై: పిలిస్తే తాను వెళ్లి శివసేన అధినేత బాల్ థాకరేతో మాట్లాడుతానని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చెప్పారు. భారీ భద్రత మధ్య ఆయన శనివారం ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. తాను చెప్పిన విషయాలను మీడియా వక్రీకరిస్తున్నారని, ఒక భారతీయుడు చెప్పాల్సిన విషయాలను తాను చెప్పానని ఆయన చెప్పారు. తాను ఇలా ఉండడం ముంబై వల్లనే అని, తనను సరిగా అవగాహన చేసుకోలేని ఆయన అన్నారు.
షారూఖ్ నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకోబోమని శివసేన శనివారం ప్రకటించింది. షారూఖ్ ఖాన్ ద్రోహి అని, అయితే షారూఖ్ ఖాన్ సినిమాను వాడుకోబోమని శివసేన చీఫ్ బాల్ థాకరే శనివారం చెప్పారు. భద్రత లేకుండా షారూఖ్ ఖాన్ ఇటాలియన్ మమ్మి సోనియా గాంధీ, ఇటాలియన్ యువరాజ్ రాహుల్ గాంధీ దీవెనలతో తన సినిమాను విడుదల చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి