వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో గతంలో పర్యటించా: రవిందర్ కౌర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravinder Kaur
న్యూఢిల్లీ: తాను ఇంతకు ముందు తెలంగాణలో పర్యటించినట్లు రాష్ట్ర పరిస్థితిపై అధ్యయానికి వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యురాలు, ఐఐటి ఢిల్లీ అధ్యాపకురాలు రవిందర్ కౌర్ అన్నారు. సామాజిక శాస్త్ర పరిశోధకురాలిగా తాను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, వరంగల్ రీజినల్ ఇంజినీరంగ్ కళాశాల, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చాలా సార్లు వెళ్లానని ఆమె చెప్పారు. సామాజిక అటవీ పథకాల అధ్యయనంలో భాగంగా తాను తెలంగాణలో పర్యటించినట్లు, హైదరాబాద్ చాలా సార్లు వెళ్లినట్లు ఆమె చెప్పారు. తనను కలిసిన కొద్ది మంది మీడియా ప్రతినిధులతో ఆమె శుక్రవారం మాట్లాడారు. తాను క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యను అధ్యయనం చేస్తానని ఆమె చెప్పారు. భావోద్వేగాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో సమస్యను అధ్యయనం చేయనున్నట్లు ఆమె తెలిపారు. అందరికీ మంచి చేసే నిర్ణయమే వెలువడుతుందని ఆమె ఆశించారు.

సామాజిక శాస్త్రవేత్తగా వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అధ్యయన చేస్తానని ఆమె చెప్పారు. వాస్తవాలను నిష్పక్షపాతంగా మదింపు చేయడమే తమ పని అని ఆమె చెప్పారు. విధివిధానాలు ఖరారైన తర్వాత కమిటీలోని ఎవరు ఏ పని చేయాలో నిర్ణయమవుతుందని ఆమె అన్నారు. ఒకటి రెండు రోజుల్లో విధివిధానాలు ఖరారవుతాయని ఆమె అన్నారు. కమిటీ నుంచి వచ్చే నిర్ణయం మరో వివాదానికి దారి తీయకుండా చూస్తామని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో సాగుతోందని, అయితే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనూ వెనకబడిన ప్రాంతాలు ఉండవచ్చునని ఆమె అన్నారు. విధివిధానాలు వెల్లడైన తర్వాత తాము ఏ మార్గంలో వెళ్లాలో అర్థమవుతుందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X