Tamil Nadu: మందుబాబులకు సీఎం విజయ్ బిగ్ షాక్..! సంచలన నిర్ణయం..!

తమిళనాడు (Tamil Nadu) లో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటు చేసి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న టీవీకే అధినేత విజయ్ (Vijay).. ఇవాళ మరో కీలక ఉత్తర్వు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మందు బాబులకు షాకిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రార్ధనా స్దలాలు, పాఠశాలల వద్ద ఉన్న 717 మద్యం దుకాణాలను మూసేయాలని విజయ్ ఆదేాలు ఇచ్చారు. దీంతో అధికారులు ఇప్పుడు వాటిని తొలగించే చర్యలు ప్రారంభించారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న తన మొదటి ప్రధాన పరిపాలనా నిర్ణయంలో భాగంగా, జోసెఫ్ విజయ్ .. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్ స్టాండ్‌ల సమీపంలో నడుపుతున్న 717 ప్రభుత్వ మద్యం రిటైల్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)కు చెందిన అన్ని దుకాణాలను రాబోయే రెండు వారాల్లోగా మూసివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

New CM New Rules Vijay Shuts 717 Liquor Shops Near Schools and Places of Worship

విజయ్ ను చూసి ఆనందం పట్టలేక..! వైకో ఇంట్లో పనిమనుషుల వీడియో వైరల్..!
తమిళనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 4,765 టాస్మాక్ మద్యం రిటైల్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో 717 దుకాణాలు ఇలా ప్రార్దనా స్ధలాలు, పాఠశాలలు, బస్టాండ్ల సమీపంలో ఉన్నాయి. వీటిలో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యా సంస్థల సమీపంలో, 255 బస్ స్టాండ్‌ల సమీపంలో ఉన్నాయి. వీటిని త్వరలో మూసేస్తారు. సున్నితమైన బహిరంగ ప్రదేశాలలో మద్యం ప్రవాహంపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా విజయ్ తీసుకున్న ఓ కీలక సామాజిక సంస్కరణ చర్యగా ప్రభుత్వం దీన్ని ప్రచారం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+