అధికారం, హోదా న్యాయానికి అడ్డు రాకూడదు.. మంచు మనోజ్ సంచలన ట్వీట్ !!
బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా విచారణ పారదర్శకంగా జరగాలని డీజీపీకి సూచించారు. దాంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఈ సిట్ విచారణ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్టులో అధికారం, హోదా, పలుకుబడి లేదా స్థాయి ఎన్నడూ న్యాయానికి అడ్డు రాకూడదని రాసుకొచ్చారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మైనర్ బాలికలకు న్యాయం అందించడమే పోక్సో చట్టం లక్ష్యం అని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా ఇది రాజకీయాలకు, వ్యక్తిగత విషయాలకు సంబంధించినది కాదని.. నిజం బయటకు రావాలని.. న్యాయం గెలవాలని పోస్ట్ చేశారు.

ఇంకా ఏం పోస్ట్ చేశారంటే..
అంతే కాకుండా పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతి మైనర్ బాలికకు న్యాయం అందేలా చూడటానికే పోక్సో చట్టం రూపొందించబడిందని తాను గట్టిగా నమ్ముతున్నానన్నారు. రాజ్యాంగం, చట్టం ప్రకారం ప్రతి బాలికకు సమానమైన న్యాయం పొందే హక్కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మైనర్ కేసులలో తక్షణ చర్య, పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అని.. ఆలస్యం లేదా పక్షపాతం ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఎలాంటి ఒత్తిడులు లేకుండా విచారణ జరగాలని.. న్యాయం జరగాలని.. చట్టానికి ఎవరూ అతీతులు కారని రుజువు కావాలని ఆయన కోరారు.
ఇక ఈ పోస్ట్‌కు తెలంగాణ సీఎంఓ, డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్లను మనోజ్ ట్యాగ్ చేశారు. కాగా బండి భగీరథ్ ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదుతో మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కేసులో తనపై 'హనీ ట్రాప్' జరిగిందంటూ బండి భగీరథ్ కరీంనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 11, 2026
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position,…












Click it and Unblock the Notifications