న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం దశ దాటిపోయిందని, పరిస్థితి త్వరలోనే మెరుగు పడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. శనివారం ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ధరల నియంత్రణకు రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధరలు అదుపు చేసేందుకు రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆహార ధాన్యాల కొరతపై రాష్టాలు సమీక్షించారు. ధరల నియంత్రణకు కేంద్రంతో రాష్ట్రాలు చేతులు కలపాలని, కేంద్రం కూడా తగిన సహాయం చేస్తుందని ఆయన అన్నారు. చక్కెరపై వ్యాట్ ఎత్తేయాలని ఆయన సూచించారు.
ఎన్డీయె హయాంలో కూడా ధరలు పెరిగాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడిందని ఆయన అన్నారు. ఎగుమతులను నిరుత్సాహపరుస్తున్నామని, అవసరమైతే నిషేధిస్తామని ఆయన తెలిపారు. అధిక దిగుబడులు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన చెప్పారు. పంచదార ధరలను నియంత్రించడానికి ముడి పంచదార దిగుమతిని అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన అన్నారు. దీన్ని సమూలంగా మార్చాలని ఆయన సూచించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి