కాంగ్రెసు సమన్వయ కమిటీలో జగన్

రాష్ట్ర విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసిన నేపథ్యంలో ఈ సమన్వయ కమిటీని వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, శాసనసభా సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ స్థితిలో పార్టీ నాయకులు, శాసనసభ్యులు అంతా ఏకతాటి మీద ఉండేందుకు వీలుగానే ఈ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఇటువంటి సమన్వయ కమిటీని వేసినప్పటికీ డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడైన తర్వాత అది జాడ లేకుండా పోయింది. రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి పార్టీ శాసనసభ్యులంతా ఒక తాటి మీద ఉన్న జాడలు కనిపించలేదు. వైయస్ జగన్ వర్గం ఏదో రకంగా రోశయ్యను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగుతూ వచ్చింది. జగన్ ను, కెవిపిని సమన్వయ కమిటీలో వేయడం శాసనసభ సమావేశాలు సజావుగా జరగడానికేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications