హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు, చిత్ర నిర్మాత కొడాలి నాని వ్యాఖ్యల ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆదుర్స్ తప్పించుకోలేకపోతోంది. తెలంగాణవ్యాప్తంగా అదుర్స్ ప్రదర్శనకు సోమవారం విఘాతం కలిగింది. మంగళవారం కూడా అదుర్స్ అవే ఆటంకాలను ఎదుర్కుంటోంది. తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా హైదరాబాదులో కూడా అదుర్స్ ప్రదర్శనను తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారు.
హైదరాబాదులోని కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో అదుర్స్ సినిమా ప్రదర్శనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా హైదరాబాదు సమీపంలోని చందానగర్ లోని ఓ థియేటర్ లో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాదులోని పలు థియేటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి