వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ జాతరకు హైకోర్టు అనుమతి

తెలంగాణ జాతరను ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని, రాజకీయాలు జాతరలో ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు జాతరను నిర్వహిస్తామని రసమయి బాలకిషన్ చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడానికి ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని వాగ్గేయకారులు, కళాకారులు ఈ జాతరకు వచ్చి ప్రదర్శనలు ఇస్తారని ఆయన చెప్పారు.