వైష్ణవి: మృతదేహాన్ని కృష్ణానదిలో పడేయాలనుకున్నారా?

అయితే కిడ్నాప్ జరిగిన రెండు మూడు గంటల తర్వాత పోలీసులు వెంకట్రావుకు ఫోన్ చేసి, తమవద్దకు రావాలని కోరారు. దీంతో పోలీసులు తమను అనుమానిస్తున్నారని గ్రహించిన నిందితులు వ్యూహం మార్చారు. ఆ తరువాత పోలీసులు మళ్లీ వెంకట్రావు సెల్‌ఫోన్‌కి కాల్ చేయగా, స్విచాఫ్ చేసి ఉంది. నదిలో పడవేస్తే మృతదేహం దొరికే అవకాశం ఉంటుందని భావించి, ఆ యత్నాన్ని విరమించుకున్నారు. మృతదేహం ఆనవాళ్లు కూడా దొరక్కుండా ఉండాలంటే కొలిమిలో వేయడమే మార్గమని భావించి రాత్రి వరకూ మృతదేహాన్ని ఒక గోడౌన్‌లో దాచారు. రాత్రికి గుంటూరులోని శారదా ఇండస్ట్రీస్ కు తీసుకెళ్లి, అక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాలో మృతదేహాన్ని ఉంచి కొలిమిలో వేసి కాల్చారు. ఈ విషయాలను నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది.
వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో మోర్ల శ్రీను, జగదీష్ లను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు వారిద్దరినీ మంగళవారం రాత్రి తమ అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఆరుగంటలకే వారిని తమ కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. 7.30 గంటలకు పోలీసులు జిల్లా జైలుకు వచ్చి 8.30 గంటల సమయంలో వారిని తమతోపాటు తీసుకెళ్లారు. ఈ సమయంలో యధావిధిగా వారి మొహాలకు తెల్ల ముసుగులు వేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నిందితులను తీసుకెళ్లడానికి సెంట్రల్‌జోన్ ఏసీపీ ఆవుల సుబ్బారావు జిల్లా జైలుకు వచ్చారు.












Click it and Unblock the Notifications