రూర్కేలా: ఒరిస్సాలో మావోయిస్టులు బుధవారం తెల్లవారు జామున రైల్వై ట్రాక్ ను పేల్చేశారు. దీంతో గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పింది. హౌరా - ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బిస్రా, భలులత స్టేషన్ల మధ్య మావోయిస్టులు బుధవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ ను పేల్చేశారు. దాంతో గూడ్స్ రైలు ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ప్రాణ నష్టమేదీ లభించలేదు.
హౌరా - ముంబైల మధ్య ఇరు వైపులా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ప్రదేశం రూర్కేలాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంఘటనా స్థలానికి సిఆర్పీఎఫ్, జిఆర్పీ దళాలు చేరుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఇక్కడ మావోయిస్టులు రైల్వే ట్రాక్ ను పేల్చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి