ఆ అధికారి ఆస్తులు 30 కోట్ల దాకా

ఇప్పటి వరకు ఎసిబి నిర్వహించిన సోదాల్లో - 33 ప్లాట్లు, మూడు కిలోల బంగారం, 20 కిలోల వెండి, 13 లక్షల రూపాయల నగదు బయటపడ్డాయి. రెండు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్లు తేలింది. హైదరాబాదులోని బంజారాహిల్స్, రెడ్ హిల్స్, శ్రీనగర్ కాలనీల్లో ఆయన, ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి విలువైన డ్యాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయనగారికి ఓ కారు కూడా ఉంది. హైదరాబాద్ సమీపంలోని షేక్ పేటలో జిప్లస్ - 3 భవనం నిర్మాణంలో ఉంది. కృష్ణా జిల్లాలో 16 ఎకరాల భూమి బయటపడింది. వేయి అమెరికన్ డాలర్లు కూడా ఉన్నాయి. అక్రమ కలప వ్యాపారానికి సంబంధించిన ఆరోపణలు రావపడంతో ఎసిబి అధికారులు గోపాలకృష్ణ ఆస్తుల వివరాల కోసం సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications