మంత్రులపై రోశయ్య మండిపాటు

దామోదర్ రెడ్డి తనపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరూ మాట్లాడకపోవడమేమిటని ఆయన అడిగారు. సమావేశంలో ఉన్న మంత్రి డికె అరుణను ప్రత్యేకంగా ప్రశ్నించారు. తాను దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు వినలేదని అరుణ ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం. మంత్రులు బాధ్యతగా వ్యవహరిస్తూ సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి ఆగ్రహం దాంతో ఆగిపోలేదు. నిజామాబాద్ సమీక్ష సమావేశంలో ఆయన ఏకంగా అలిగారు. బుధవారం జరిగిన నిజామాబాద్ సమీక్షా సమావేశంలో జై తెలంగాణ నినాదాలు చేయడంపై ఆయన అలక బూనారు. తాను జై ఆంధ్ర, తెలంగాణ నినాదాలు వినడానికి రాలేదని ఆయన చెప్పారు. ఆ నినాదాలకు అలిగి ఆయన చేంబర్ లోకి వెళ్లిపోయారు. మంత్రి శ్రీధర బాబు, ఉన్నతాధికారులు ఆయన వెంట వెళ్లి బతిమాలారు. అరగంట తర్వాత అలక వీడి ఆయన వెనక్కి వచ్చారు.












Click it and Unblock the Notifications