శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో మరింత జాప్యం

కాగా, శ్రీకృష్ణ శనివారం ముంబై నుంచి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. కమిటీ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగవచ్చునని అంటున్నారు. అందువల్ల కమిటీ విధివిధానాల కోసం మరో ఐదారు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థేతే ఉంది. మంత్రి వర్గ సమావేశంలో పెట్రో ధరల పెంపుపై కూడా చర్చ జరగలేదు. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం 13వ ఆర్థిక సంఘం సిఫార్సులను యధావిధిగా ఆమోదించింది. కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా పెంచాలనే ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆర్థిక సంఘం సిఫార్సులను, ఆర్థిక సర్వేలను కేంద్రం ఈ నెల 25వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడుతుంది.












Click it and Unblock the Notifications