దాడికి కెసిఆర్ బాధ్యత వహించాలి: శ్రీధర్

కాగా, శ్రీధర్ బాబుపై జరిగిన దాడితో తమ పార్టీకి సంబంధం లేదని తెరాస శాననసభ్యుడు కెటి రామారావు అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే మంత్రులు కూడా పని చేయాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఐపియల్ రాష్ట్రం నుంచి తరలిపోవడం వల్ల బాధ ఏమీ లేదని ఆయన అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదని, తాము కమిటీని గుర్తించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు భ్రమల్లో ఉన్నారని ఆయన అన్నారు. కమిటీనే తాము గుర్తించనప్పుడు అది ఏదో ఒరగబెడుతుందని మాట్లాడడం కూడా అనవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications