సమన్వయానికి కోదండరామ్ ప్రయత్నాలు

శుక్రవారం సాయంత్రం ఆయన కెసిఆర్ తో సమావేశమయ్యారు. మరోసారి శనివారం ఉదయం కూడా కెసిఆర్ తో సమావేశమయ్యారు. రాజీనామాల నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన తెరాసను కోరారు. దాంతో రాజీనామాల నిర్ణయాన్ని తెరాస రేపటికి వాయిదా వేసుకుంది. రేపు ఉదయం పదకొండున్నర గంటలకు తెరాస శాసనసభ్యులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అపాయింట్ మెంటు తీసుకున్నారు. అలాగే, శుక్రవారం సాయంత్రమే కోదండరామ్ తెలుగుదేశం తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు.
శనివారం ఉదయం కోదండరామ్ బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయతో సమావేశమయ్యారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులను కూడా కలుపుకుని వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జెఎసిలోనే కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జెఎసి సమావేశం ఎప్పుడైనా జరగవచ్చునని, జెఎసి తర్వాతనే తదుపరి కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రజారాజ్యం శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications