టిడిపి వాళ్ళు స్పీకరు సమర్పించాలి: కె చంద్రశేఖర రావు
State
oi-Santaram
By Santaram
|
హైదరాబాద్: టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయనివారిని సాంఘికంగా బహిష్కరిస్తామని ఆయన అన్నారు. జేఏసీలో కూడా బహిష్కరణకు ప్రతిపాదిస్తామన్నారు. టీడీపీ సభ్యులు రాజీనామా చేస్తే కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తాము రాజీనామా చేస్తామని టీడీపీ అనటం దౌర్భాగ్యమన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో టీడీపీ ఆటలాడుకొంటుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ విషయంలో చంద్రబాబునాయుడు రెండు నెలలు డీప్ ప్రీజ్‌లో ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. గతంలో తాను తెలంగాణపై ఇచ్చిన మాటకు బాబు కట్టుబడి ఉన్నారా అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి