హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం విజృంభించిన పోలీసులు సోమవారం మళ్లీ స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు ఓయూ బీ హాస్టల్‌ను చుట్టుముట్టారు. దాంతో పోలీసులు వెనక్కి వెళ్లాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా అసెంబ్లీ వైపు దూసుకువెళ్లేందుకు సిటీ కాలేజ్ విద్యార్థులు యత్నించటంతో మొజాంజాహి మార్కెట్ వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి