వికారాబాద్: ఓయూలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోఆందోళనకారులు సోమవారం విధ్వంసానికి పాల్పడ్డారు. పట్టణంలో 15 ఆర్టీసీ బస్సులు, రెండు సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లను ధ్వంసం చేశారు. పలు ఆంధ్రా హోటళ్లపైనా దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఇలా ఉండగా తమ రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో మార్పులు చేస్తేనే తమ రాజీనామాలపై ఆలోచిస్తామని సోమవారం ఆయన ఇక్కడ అన్నారు.
రాజీనామాలు చేయటానికి తెలంగాణ నేతలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశంపై ప్రస్తావన లేకపోవటం తెలంగాణ ప్రజలను అవమానించటమేనని దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి