నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా దోనకల్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. విహారయాత్రకు వెళుతున్న ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి