హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తన లోక్‌సభ సభ్యత్వానికి బుధవారం (17న) రాజీనామా చేయనున్నారని సమాచారం. లోకసభ స్పీకర్ మీరాకుమార్ అపాయింట్‌మెంట్‌ను కేసీఆర్ కోరినట్లు తెలియవచ్చింది. అయితే ఆమె ఢిల్లీలో లేనందువల్ల అపాయింట్‌మెంట్ అభ్యర్థన పరిశీలనలో ఉంది. మీరాకుమార్ మంగళవారం ఢిల్లీ చేరుకోనున్నారు. ఆ మరుసటి రోజు (బుధవారం) కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ లభించవచ్చని సమాచారం. సోమవారం కేసీఆర్ ఢిల్లీ చేరుకోనున్నారు.
మరో ఎంపీ విజయశాంతి కూడా తన రాజీనామా సమర్పించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందూ కేసీఆర్ రాజీనామా సమర్పించినా, నిబంధనల ప్రకారం లేనందున స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించలేదు. ఈసారి స్వయంగా స్పీకర్‌ను కలిస నిబంధనల ప్రకారమే పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి