నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ స్టీల్ ఫ్యాక్టరీలో మంగళవారం సంభవించిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. కాప్సీ గ్రామంలోని జేడీ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో సాంకేతిక కారణం వల్ల ఈ పేలుడు చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీని వెనుక తీవ్రవాదుల కుట్ర లేదని భావిస్తున్నట్టు చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణలు, సీనియర్ పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.