హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం జిల్లా నాయకులతో విభేదించి చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వలస వెళ్లిన గంటా శ్రీనివాసరావు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు. ఆయన పీఆర్పీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంటా బుధవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.