డిజిపికి చట్టమంటే గౌరవం లేదు: హైకోర్టు

దాడి జరిగినపుడు ఉస్మానియా వర్సిటీలో పోలీసు బృందానికి నేతృత్వం వహిస్తున్న జాయింట్ పోలీసు కమిషనర్ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు ఈనెల 18న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. అక్కడ జరిగిన సంఘటనలపై కౌంటరు దాఖలు చేస్తామని, అప్పటివరకు గడువు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ ఎ.సత్యప్రసాద్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తూ..విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదావేశారు. ఇదే హైకోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న డీజీపీ ఈ కోర్టు ఆదేశాల్నే అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. "మంత్రివర్గం, ముఖ్యమంత్రి, హోంమంత్రి అందరూ నిస్సహాయులంటున్నారు. కోర్టు ఉత్తర్వులంటే గౌరవంలేదు. మరి పోలీసుల్ని నియంత్రించేదెవరు" అని ప్రశ్నించారు. ఓ మాజీ పోలీసు అధికారి రాష్ట్ర గవర్నరుగా పనిచేస్తున్నారని, తమ చర్యలు ఆయనకు తెలుస్తాయని కూడా ఆలోచించకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications