ఉల్లంఘనల వల్లనే రోడ్డెక్కారు: అక్బురుద్దీన్

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలు బాధ్యులు కారని, ఈ మూడు ప్రాంతాల నేతలే బాధ్యులని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే సందేహం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన అన్నారు. తాను మొదట భారతీయుడినని, ప్రాంతాలవారీగా దేశాన్ని విభజించడాన్ని తాను అంగీకరించబోనని ఆయన అన్నారు. ప్రతి భారతీయుడు దేశంలో ఎక్కడైనా ఉండవచ్చునని, ఎక్కడికైనా వెళ్లవచ్చునని, ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. మూడు తరాల నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు తెలంగాణలో ఉంటున్నారని, ఇక్కడే ఉంటారని, అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములేనని ఆయన అన్నారు. వారిని సెటిలర్లు అనడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications