పిల్లోల్లతో రాజకీయం ఏంది రాహుల్ గాంధీ..: రాజీనామా చేయమన్నందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఎదురుదాడి

నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే దేశ రాజధాని అట్టుడికిపోతోందీ విషయంలో. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఉండటంతో అటు ప్రతిపక్షాలు సైతం కత్తి దూస్తోన్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడానికి విఫలయత్నం చేసింది. ఈ ఘటనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వారిని పోలీసులు విడుదల చేశారు.

ఈ పరిణామాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకోవడానికి, దేశంలో అశాంతిని సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను ఒక రాజకీయ అస్త్రంలా వాడుకుంటోందని ఆరోపించారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం ఇష్టం లేదని మండిపడ్డారు.

Dharmendra Pradhan Slams Rahul Gandhi says Students Used as Political Tools During NEET Row

రాజకీయ ఘర్షణలు సృష్టించడం, దీనిద్వారా మీడియాలో హెడ్ లైన్లల్లో నిలవడానికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి చౌకబారు పద్ధతులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినప్పటికీ ప్రతిపక్షాలు కావాలనే గందరగోళం సృష్టిస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు.

ప్రధాని మోదీ అధికారిక నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాను ధర్మేంద్ర ప్రధాన్ తప్పుపట్టారు. ఈ నిరసన ప్రదర్శనల వల్ల ఒరిగేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా భద్రతను ఉల్లంఘించినట్టయిందని అన్నారు. నీట్ పరీక్షల వివాదంపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించడానికి తాము సిద్ధమని ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు.

దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రతి అంశంపైనా చర్చించి, పరిష్కారాలను కనుగొనడానికి తాము కట్టుబడి ఉన్నామని, దీనికంటే వాటిని రాజకీయంగా వాడుకోవడమే రాహుల్ గాంధీ నైజమని ధర్మేంద్ర ప్రధాన్ దుయ్యబట్టారు. విద్యార్థులు రాజకీయ పార్టీల ప్రచారాలకు ఉపయోగపడే సాధనాలు కాదని హితవు పలికారు. వారికి కావలసింది నిర్మాణాత్మక పరిష్కారాలే తప్ప నినాదాలు, నిరసనలు కావని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+