కమ్మని 'సొరకాయ హల్వా'.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది..!
హల్వా అనగానే పెద్దల నుంచి పిల్లల వరకూ నోరూరుతుంది. హల్వా లో చాలా రకాలు ఉంటాయి. క్యారెట్ హల్వా, బ్రెడ్ హల్వా, బేసన్ హల్వా, గుమ్మడి కాయ హల్వా, సొరకాయ హల్వా ఇలా అనేక రకాలుగా తయారు చేసుకుంటారు. అయితే సొరకాయ హల్వా చాలామంది ఇష్టంగా తింటారు. ఎంతో తీయగా ఉండే ఈ హల్వాను ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. మరి ఈ సూపర్ టేస్టీ సొరకాయ హల్వా తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
సొరకాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే సొరకాయ ఒకటి, పాలు ఒక కప్పు, పంచదార అర కప్పు, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్, నెయ్యి, జీడిపప్పు, బాదం వేయించినవి తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి చెక్కుతీయాలి. ఆ తర్వాత గింజలు తొలగించి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి పోయాలి. ఆ తర్వాత సొరకాయ తురుమును వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అది మెత్తబడ్డాక పాలు పోసి దగ్గర పడేంత వరకూ ఉడికించుకోవాలి.

ఇప్పుడు పాలు విరిగిన తర్వాత ఆ మిశ్రమంలో పంచదార వేసి అది కరిగేంత వరకూ ఉడికించుకోవాలి. ఇక అందులో చివరగా యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమం చిక్కబడి నెయ్యి తేలేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో వేయించిన జీడిపప్పు, బాదం వేయాలి. ఆ తర్వాత కలిపి దింపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయినట్టే.. ఇప్పుడు సొరకాయ హల్వాను వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.. ఇలా మీరూ ఓసారి ట్రై చేయండి.












Click it and Unblock the Notifications