రెండేళ్లే టైమ్.. ఆ తర్వాత 200 శాతం పన్ను బాదుడే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ ఔషధ మార్కెట్‌ను ఒక్కసారిగా ఊపేశారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే జనరిక్ మెడిసిన్ విషయంలో సరికొత్త సుంకాల విధానాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, డ్రగ్స్ తయారీని మళ్లీ అమెరికా గడ్డపైకే తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన కథనం ప్రకారం.. 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి అమెరికాలోకి వచ్చే జనరిక్ మందులపై తొలి రెండేళ్ల పాటు ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ గడువు ముగిసిన వెంటనే మూడో ఏడాది నుంచి ఏకంగా 100 శాతం, ఆ తర్వాతి సంవత్సరం నుంచి బెంబేలెత్తించేలా 200 శాతం సుంకం విధించనున్నారు. ఇచ్చిన గడువులోగా అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయని కంపెనీలకు ఇది ఒక రకమైన హెచ్చరిక అని, తమ పౌరుల ప్రయోజనాల రక్షణకే ఈ కఠిన నిబంధనలు తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

US Generic Drug Tariff Rules Free Duty For Two Years Followed By Massive Steep Hikes On Foreign Imports

బ్రాండెడ్ మందులకు ఊరట..

మరోవైపు పేటెంట్, బ్రాండెడ్ లేదా సరికొత్త రకం మెడిసిన్ కు సంబంధించి పాత విధానమే కొనసాగుతుందని ట్రంప్ వెల్లడించారు. ఈ విధానం ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో డ్రగ్ నిర్మాణం వేగంగా జరుగుతోందని, త్వరలోనే దేశం ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా మందుల మార్కెట్‌ షేక్..

ప్రస్తుతం అమెరికా మెడికల్ రంగంలో వినియోగించే దాదాపు 90 శాతానికి పైగా ప్రిస్క్రిప్షన్లలో జనరిక్ మందులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని.. గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాకు పెద్ద ఎత్తున మందులను ఎగుమతి చేసే భారతీయ పారా కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+