దిల్ రాజు గుడికి వివి వినాయక్ శ్రమదానం

కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ దర్శకులు వివి వినాయక్, దశరథ్, 'మా పల్లె చారిటబుల్ ట్రస్టు' చైర్మన్, సినీ నిర్మాత దిల్‌రాజు, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీటీసీ సభ్యుడు కె మోహన్, డీసీసీబీ డైరెక్టర్ మానాల మోహన్‌రెడ్డి, ట్రస్టు వ్యవస్థాపకుడు వి.నరసింహారెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
తన సొంత గ్రామంలో ఆలయ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యం కావాలని నిర్మాత దిల్ రాజు ఆహ్వానం మేరకు దర్శకులు వివి వినాయక్, దశరథ్ లు నర్సింగ్ పల్లికి వచ్చారు. ఆదివారం ఆలయ ధ్వజస్తంభం నిర్మాణ పనులను వారు శ్రమదానంతో చేపట్టారు. వీరితో పాటు బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శ్రమదానం చేశారు. ముందుగా ఆలయంలో పూజలు చేసి కార్యక్రమాలు చేపట్టారు.
వివి వినాయక్, దశరథ్ లు మాట్లాడుతూ మా పల్లె చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, తమకు పాల్గొనే అవకాశం లభించినందుకు సంతృప్తికరంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications