న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆమె రెండోసారి. ఈ బడ్జెట్ లో ముఖ్యాంసంగా ప్రస్తుతానికి రైలు ఛార్జీలు పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఈ రైల్వై బడ్జెట్ లో ప్రధానాంశాలు...వ్యవసాయ ఉత్పత్తుల రవాణకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయటం. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కొత్తగా శాంతి ఎక్స్‌ప్రెస్ నడపటం. ఇకనుంచి రైల్వే ఎంక్వైరీకి 138 కొత్త నెంబర్ వ్యవహరించటం. రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతూ రిజర్వేషన్ కౌంటర్లను విస్తరిస్తారు. ప్రైవేటు భాగస్వామ్యం. వాటితో ఆదాయం పంచుకునే పద్ధతిలో కొత్త రైలు మార్గాల రూపకల్పన.కొత్త పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనల సరళీకరణ. వీటికి తోడు రైలు ప్రమాదాల నివారణకు నిధుల పెంచటం. పర్యాటక కేంద్రాలను కలుపుతూ కొత్తగా సంస్కృతి ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేయటం జరుగుతుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి