• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైల్వేలను ప్రైవేటీకరించం: మమతా

By Pratap
|

Mamata Banejee
న్యూఢిల్లీ: ప్రయాణికులపై భారం వేయకుండా రైల్వే మంత్రి మమతా బెనర్జీ బుధవారం రైల్వే బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రయాణికుల రవాణా ఆదాయం తగ్గగా, సరుకు రవాణా ఆదాయం పెరిగిందని ఆమె చెప్పారు. సరుకు రవాణా చార్జీలను కూడా ఆమె పెంచలేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం రైల్వేపై కూడా పడిందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైల్వే సదుపాయాలను విస్తరించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. 21 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లను విస్తరిస్తామని చెప్పారు. రూ. 41,226 కోట్ల రూపాయలతో ఆమె వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామన్ వెల్త్ క్రీడలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఆమె తెలిపారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. భారత, బంగ్లాదేశ్ ల మధ్య కొత్త రైలును ఆమె ప్రతిపాదించారు.

భారతీయ రైల్వే సమైక్యతకు చిహ్నమని ఆమె అన్నారు. పలు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ కు వరాల పంటను ప్రకటించారు. మరిన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రతిపాదించారు.దీర్షకాలిక డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనలను సరళీకరిస్తామని అన్నారు. నిరుటి బడ్జెట్ లోని 120 రైళ్లలో 117 రైళ్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైల్వేతో చేతులు కలపాలని ఆమె కార్పొరేట్ సంస్థలను కోరారు. ప్రయాణికుల భద్రత రాష్ట్రాలదేనని ఆమె స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు -

- రైల్వే చార్జీల పెంపు లేదు

- కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శాంతి ఎక్స్ ప్రెస్ రైలు

- రైల్వే విచారణకు మరో కొత్త నెంబర్ 138

- తత్కాల్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతాం

- ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆదాయం పంచుకునే పద్దతిలో కొత్త రైల్వే మార్గాలు

- రైల్వే రిజర్వేషన్ల కౌంటర్ల విస్తరణ

- గ్రామ పంచాయితీల్లో కూడా రైల్వే టికెట్ల అమ్మకం

- కొత్త రైళ్ల ఏర్పాటుకు పిపిపి విధానం

- ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లోనే కాకుండా స్థానిక భాషల్లో కూడా రైల్వే పరీక్షలు

- గత ఏడాది రాయితీలన్నీ కొనసాగింపు

- హైస్పీడ్ రైళ్ల కోసం కొత్త ప్రణాళిక

- ఈ ఏడాది కొత్తగా వేయి కిలోమీటర్ల కొత్త మార్గాలు

- వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు

- మంచినీటి సరఫరాలో ప్రైవేట్ భాగస్వామ్యం

- ఈ - టికెట్లకు మరింత మంది ఏజెంట్లు

- ప్రయాణికుల సౌకర్యం కోసం రూ. 1,300 కోట్లు

- కొత్త రైల్వే లైన్ల పూర్తికి రూ. 20 వేల కోట్లు

- ఓబిసి, మహిళలకు ఆర్ఆర్బీ పరీక్ష ఫీజులో మినహాయింపు

- త్వరలో డబుల్ డెక్కర్ గూడ్స్ రైళ్లు

- వచ్చే ఐదేళ్లలో మానవరహిత లెవల్ క్రాసింగ్ లు

- 2020 నాటికి 25 వేల కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాలు

- సికింద్రాబాద్ సహా ఐదు మెట్రో నగరాల్లో రైల్వే స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు

- పోస్టాఫీసుల్లో రిజర్వేషన్ సౌకర్యం

- మహిళలకు రైల్వే క్రాసింగ్ లెవల్ బాధ్యతలు

- రైల్వేకు కల్చర్ అండ్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు

- పెట్టుబడుల కోసం వంద రోజుల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్

- రైల్వే ఉద్యోగులందరికీ గృహ వసతి

- మొబైల్ వ్యాన్లలో ఈ - టికెటింగ్ సౌకర్యం

- 12 మహిళా ఆర్పీఎఫ్ బెటాలియన్లు

- బెంగూళూరులో చక్రాల ప్రాంతీయ అభివృద్ధి కేంద్రం

- భూమి దొరికితే సింగూరులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

- ఐదు కొత్త కోచ్ ఫ్యాక్టరీలు

- మరో మూడు డివిజన్లలో రైళ్లు డీకొనకుండా ప్రత్యేక వ్యవస్థ

- పెరంబూరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆధునీకరణ

- ఖరగ్ పూర్ లో లోకో పైలట్ శిక్షణా కేంద్రం

- ఏడాది లోగా రాయబరేలీ ఫ్యాక్టరీ పనులు

- సికింద్రాబాదులో వేగన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు

- స్లీపర్ క్లాస్ సర్సీస్ చార్జీ రూ. 10 తగ్గింపు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X