రాజకీయ పార్టీలు చెప్పాల్సిందే: దుగ్గల్

కమిటీకి సహాయం చేసేందుకు నోడల్ అధికారిగా ఐఎఎస్ అధికారి రాజీవ్ శర్మను నియమించినట్లు ఆయన తెలిపారు. తన అవసరాల గురించి ముఖ్యమంత్రి కె రోశయ్యకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు రాతపూర్వకంగా కమిటీకి అందజేయాలని ఆయన అన్నారు. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రజా సంఘాలు, ఇతర వర్గాలు ఇ - మెయిల్, లేఖల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని ఆయన అన్నారు. తన హైదరాబాద్ పర్యటన విజయవంతమైందని, ఈ విషయాన్ని కమిటీ సమావేశంలో చెప్తానని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల కోసం, పాలనాపరమైన ఏర్పాట్ల కోసమే తాను ఈసారి హైదరాబాద్ వచ్చానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications