వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీలో రెచ్చిపోయిన రోశయ్య

నువ్వు శుభ్రంగా తిని వచ్చావు కదా అని నరసింహులును ఉద్దేశించి అన్నారు. దీనిపై నరసింహులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. విద్యార్థులు అన్నం తినొద్దా అని నరసింహులు అంటే తాను మీరు తినొచ్చారు కదా అన్నానని, అందులో తప్పేముందని రోశయ్య అన్నారు. సమస్యను తాము తిరస్కరించడం లేదని, ఎస్సీ,ఎస్టీ, బిసీ ఉపకారవేతనాలు, ఫీజుల రీయంబర్స్ మెంటు విషయంలో ప్రభుత్వం తగిన రీతిలో వ్యవరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతిచ్చారో కూడా చెప్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి నటించాలని తప్ప సమస్యపై చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు దానిపై మాట్లాడవచ్చునని ఆయన సూచించారు. తమకే సానుభూతి ఉందనే పద్ధతిలో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించడం సముచితం కాదని ఆయన అన్నారు.