వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు నాయకురాలి కుమారుడికి ర్యాగింగ్ హింస

బాధితుడు ముగ్గురు నిందితుల పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొనగలిగాడని పోలీసులు చెప్పారు. ర్యాగింగ్ నిరోధక చట్టం కిందనే కాకుండా ఎస్ సి ఎస్ టి వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. రెండో చట్టం చాలా శక్తిమంతమైనది కావడంతో నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యే అవకాశముంది.
జెడ్పీ చైర్మన్ విజయ చాలా ఏళ్లపాటు నాగార్జున యూనివర్సిటీ బోటనీ అధ్యాపకురాలిగా పనిచేశారు. గుంటూరు జెడ్పీ ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆమెను గుర్తించి ఈ ఉన్నత పదవిని కట్టబెట్టారు. 2006 జెడ్పీ చైర్మన్ గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.