హైదరాబాద్: ప్రముఖ హీరో బాలకృష్ణ నటిస్తున్న సింహ షూటింగ్ ను తెలంగాణ ఆందోళనకారులు సోమవారం అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర గ్రామం వద్ద షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణవాదులు అక్కడికి చేరుకున్నారు. సింహకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా వారు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
దాదాపు 30 మంది తెలంగాణ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరోయిన్లు నమిత, స్నేహ ఉల్లాల్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటిస్తున్నారు. చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ఆందోళనకారులను సినిమా షూటింగులను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి