హైదరాబాద్: మాదక ద్రవ్యాల కేసులో హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. భారీ మాదక ద్రవ్యాలతో తెలుగు చిత్ర నిర్మాత కె వెంకటేశ్వర రావు కొద్ది రోజుల క్రితం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్నాటక రాజధాని బెంగుళూర్ లో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పోలీసులు మాదక ద్రవ్యాల కేసులో కీలక నిందితులుగా భావిస్తున్నారు.
బెంగుళూర్ లోని కెమికల్ ఫ్యాక్టరీ యజమాని ఇబ్రహీం, సూపర్ వైజర్ చంద్రశేఖర్ లను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు అరుణ్ అనే బ్రోకర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుంచే కెవి రావుకు మాదక ద్రవ్యాల సరఫరా అవుతున్నట్లు పోలీసులు నమ్ముతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి