పెషావర్: తాలిబాన్ చెర నుంచి ఖైబర్ ప్రాంతంలో ఇద్దరు సిక్కులను పాకిస్తాన్ భద్రతా బలగాలు రక్షించాయి. వారం క్రితం తాలిబన్ ఉగ్రవాదులు ఇద్దరు సిక్కులను నరికి చంపారు. సిక్కులను తాలిబన్ల చెర నుంచి రక్షించడానికి పాకిస్తాన్ బలగాలు ఖైబర్ లోని మారుమూల ప్రాంతాల్లో, ఖైబర్, ఔరుక్జాయ్ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ప్రజా సంబంధాల అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు.
తాలిబన్ల అపహరణకు గురైన ఇద్దరు సిక్కులు సుర్జీత్ సింగ్, గుర్వీందర్ సింగ్ సురక్షితంగా ఉన్నారని ఆ ప్రతినిధి చెప్పారు. ఈ ఆపరేషన్ లో పలువురు మిలిటెంట్లు హతమయ్యారు. ఆపరేషన్ వివరాలు అందాల్సి ఉంది. నెల రోజుల క్రితం జస్పాల్ సింగ్ తో పాటు సుర్జీత్ సింగ్, గుర్వీందర్ సింగ్ లను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. జస్పాల్ శవం ఫిబ్రవరి 21వ తేదీన కనిపించింది. మరో సిక్కు మహల్ సింగ్ శవం కూడా అదే రోజు ఔరక్జాయ్ ఏజెన్సీలో కనిపించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి