రాములమ్మ తెలంగాణ గేమ్ ప్లాన్

శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించుతామనే కాంగ్రెసు అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటనను ఆమె వ్యతిరేకించారు. కాంగ్రెసును చూసి తాము పోటీకి దిగుతామని తెలుగుదేశం పార్టీ అనడం సరైంది కాదని ఆమె అన్నారు. తెలంగాణ విషయంలో ఆ రెండు పార్టీలు కూడా మోసానికి పాల్పడుతున్నాయని ఆమె విమర్శించారు. తెరాసను ఓడించడానికి ఆ రెండు పార్టీలు సిద్ధపడుతున్నాయని, ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.
రాష్ట్ర విభజన మంచిదేనన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనను ఆమె ఆహ్వానించారు. ఆలస్యంగానైనా బొత్స మంచి ప్రకటన చేశారని ఆమె అన్నారు. మిగతా సీమాంధ్ర నాయకులు కూడా బొత్స మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications