వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ దిశగా వరంగల్, జనాభా 11 లక్షలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ నగరం ఇకపై శరవేగంగా అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలోని 53 డివిజన్లలో 7.5 లక్షల మంది నివసిస్తున్నారు. నగరాన్ని విస్తరించి 'గ్రేటర్‌'గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే కార్పొరేషన్‌ కౌన్సిల్‌ నిర్ణయించారు. నగర శివారులోని 42 గ్రామ పంచాయతీలను విలీనం చేసుకోవాలని తీర్మానించారు. దీని ఫలితంగా నగర జనాభా 11లక్షలకు పెరగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధాన పట్టణాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన 'నర్మ్‌' పథకం వర్తిస్తుందని భా విస్తున్నారు. అయితే గ్రేటర్‌ వరంగల్‌లో విలీనం చేయడానికి శివారు పలు గ్రామపంచాయతీల నుంచి ప్రజాప్రతినిధులు కొంత విముఖత చూపుతున్నారు. ఈ సమస్య ఇలాగే ఉన్నప్పటికీ కార్పొరేషన్‌ భవిష్యత్‌ ప్రణాళికను కూడా 'గ్రేటర్‌'ను దృష్టిలో పెట్టుకునే రూపొందించేందుకు నిర్ణయించారు. దీని వల్ల ప్రతిష్టాత్మకమైన 'నర్మ్‌' పథకం కూడా వర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

నగర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు మంగళవారం కార్పొరేషన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖలతో పాటు, వివిధ సంస్థలు, సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు, అసరాలు తదితర అంశాలు చర్చకు వస్తాయి. ఉదయం మేయర్‌, కార్పొరేటర్లు, అధికారులతో ఏఎస్‌ సీఐయూజీ ప్రతినిధులు సమావేశమవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇతర ప్రభుత్వ శాఖల అ«ధికారులు, ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశమై సమగ్రంగా చర్చించే విధంగా కార్యక్రమాన్ని రూపొం దిస్తారు. ఈ మేరకు అవసరమైన నివేదికను రూపొందించడంలో సిటీప్లానర్‌ విద్యుల్లత, ఇతర అధికారులు నిమగ్నమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X