అసెంబ్లీ: చీమకుర్తిపై దుమారం, వాయిదా

చీమకుర్తిలోని హంస గ్రానైట్ లో కార్మికుల మృతికి యాజమాన్యమే కారణమని తెలుగుదేశం సభ్యులు విమర్శించారు. బాధితులకు రూ. 10 లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చీమకుర్తిపై రేపు బుధవారం ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అంత వరకు ఓపికపట్టాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కన్నా ఎక్కువే ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ జరగాలని మీకు లేదంటూ నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. సభ జరిగే పరిస్థితి లేకపోవడంతో మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications