రోశయ్య గాలికి వదిలేశారు: చంద్రబాబు

ప్రభుత్వ అసమర్థత వల్లనే చీమకుర్తి ప్రమాదంలో సహాయక చర్యలు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన అన్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా ఉన్నా దాన్ని నడిపించే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు. మంత్రులు శాసనసభను అషామాషీగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. శాఖాపరంగా కనీస సమాచారం కూడా లేని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఎంతగా బాధపడ్డామో చీమకుర్తి ప్రమాదంలో కార్మికులు మరణించినప్పుడు అంతే బాధపడుతున్నామని, చీమకుర్తి కార్మికుల మృతిపై కూడా ప్రభుత్వం తగిన స్పందించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications